Listen to this article

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా

ప్రతి వేసవి కాలం ఇదే తంతు ప్రజాల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న శేఖర్ రిఫ్రిజిరేషన్ 40 వేల రూపాయల కూల్ డ్రింక్స్ నష్టపోయినట్టు బాధితులు ఆవేదన సంబంధిత అధికారులు స్పందించి విచారించి షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కొంతమంది పోలీస్ కంప్లీట్ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం సామాన్యమైన చిరు వ్యాపారులు బతుకుదెరువు కోసం శేఖర్ రిఫ్రిజిరేషన్ సంప్రదించగా సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జిలు రిపేర్లు చేస్తూ, అమ్ముతూ మోసపూరితమైన మాటలు చేప్పుతూ చిరు వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.మాకు మీరిచ్చిన ఫ్రిజ్లు సరిగా పనిచేయడం లేదని అడిగితే ఇప్పుడు సరి చేస్తాం, అప్పుడు చేస్తామని నమ్మ పలుకుతూ కొన్ని నెలలు గడిచిన తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు.వివరాల్లోకి వెళితే గద్వాల జిల్లా కేంద్రంలోని సెకండ్ రైల్వే గేట్ సమీపంలో బసవన్న చౌక్ దగ్గర ఓ చిరు వ్యాపారి శేఖర్ రిఫ్రిజిరేషన్ షాప్ దగ్గరికి వచ్చి సెకండ్ హ్యాండ్ మంచి ఫ్రిజ్లు ఎక్కడ దొరుకుతావ్ అని అడిగాగా మా దగ్గర తక్కువ రేట్ కి ఒక సంవత్సరం ఫ్రిజ్లు ఇస్తామని నమ్మబలికి 40 నుండి 50 వేలు వసూలు చేసి (దాదాపు పది సంవత్సరాల ఫ్రిజ్లు) పనికిరాని ఫ్రిజ్లు ఇచ్చారు ఇచ్చిన రెండు రోజులకే కూలింగ్ కాకపోవడంతో శేఖర్ రిఫ్రిజిరేటర్ షాప్ వారిని బాధితులు పలుమార్లు షాపు దగ్గరికి వెళ్లి అడిగారు, పలుమార్లు ఫోన్ చేసి కూడా ఎన్నోసార్లు అడిగారు, రిపేర్ చేసి ఇస్తాం, రెండు రోజులు మూడు రోజులని దాదాపు నాలుగు నెలల కాలం గడిపారు బాధితులు శేఖర్ రిఫ్రిజిరేటర్ షాప్ వారి వల్ల దాదాపు 90 వేల రూపాయలు నష్టపోయినట్టు మీడియా మిత్రులకు తెలియజేశారు షాప్ వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మీరు మమ్మల్ని మోసం చేస్తున్నట్టున్నారు మాకు డబ్బులు అయినా తిరిగి ఇవ్వండి లేదా ఫ్రిజ్లు అయినా రిపేర్ చేసి ఇవ్వండి అని గట్టిగా అడిగితే బాధితులను బెదిరిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఆ షాప్ లో ఎంతమంది మోసపోయిన బాధితులు అందరూ ఓ విలేఖరికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తూ మేము కూడా వాళ్ళ దగ్గర మోసపోయాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, త్వరలో కొంత మంది బాధితులు పోలీస్ స్టేషన్లో శేఖర్ రిఫ్రిజిరేషన్ షాప్ వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నట్టు సమాచారం