Listen to this article

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

చాలా హడావుడిగా, దొంగ చాటుగా, రాజకీయ పార్టీలలో ఉండే బహుజన నాయకుల మధ్య చర్చ కూడా లేకుండా, కనీసం బి సి మహిళల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా బిజెపి పార్టీ తెచ్చిన మహిళా బిల్లు ఎన్నో సందేహాలను లేవనెత్తుతున్నది. మహిళా బిల్లు 33 శాతం రిజర్వేషన్ తో పార్లమెంట్ లో ఆమోదం అనేది అన్ని వర్గాల మహిళల అంటే యస్ సి, యస్ టి, బిసి మైనార్టీ, ఓసీ మహిళల అభిప్రాయాలతో కూడుకొని ఆమోదం పొందాలి. కానీ అవన్నీ ఏమి లేదు, కేవలం అగ్రవర్ణ పెట్టుబడిదారీ కంపెనీల అనుకూల పాలకుల, ఇప్పటికే రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న అగ్రవర్ణ మహిళలు, కొంతమంది ఆధిపత్య అధికారులు, హిందూ మత సంస్థల ప్రతినిధులు కలిసి రూపొందించుకున్న బిల్లులు. ఇలాంటి బిల్లులు ఆమోదం పొందినా వారి స్వార్థపూరిత ప్రయోజనాలు, కంపెనీల కన్నుసన్నలలో, అగ్రవర్ణ ఆధిపత్య మహిళల ప్రయోజనాల మధ్యనే మళ్లీ చట్టాలు అరకొరగా అమలు జరుగుతాయి. కనుక కనీస చర్చలు, అందరి భాగస్వామ్యంతో కూడుకొని లేకపోతే ఏ చట్టాలు అయినా నీరుగారిపోక తప్పదు. జనాభా, కుల గణన లెక్కలు 2027 లో వచ్చే అవకాశం ఉన్నా గానీ, హడావిడిగా బిల్లులు పెట్టి, బహుజన వర్గాల మధ్య అయోమయం సృష్టించారు. కనుక ఇదంతా అగ్రవర్ణ ఆధిపత్య పాలకుల కుట్రలే. ఇప్పటికైనా అన్ని వర్గాల మహిళతో పాటు, బి సి మహిళల రిజర్వేషన్ల ను అమలు చేసిన తర్వాతనే చట్ట రూపంలోకి రావాలి. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్ బాబు, వినోద్ కుమార్, కుర్వ పల్లయ్య, డాక్టర్ తాహెర్ గోపాల్ యాదవ్, శంకర ప్రభాకర్, టీచర్ మోహన్,ప్రేమ్ కుమార్, నాగన్న,
తదితరులు పాల్గోన్నారు.