Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 18 అమలాపురం

భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు జగతా శాంతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కూటమి వ్యతిరేకించి మహిళా లోకం పట్ల తమ వైఖరి తెలియజేసిందని దశాబ్దాలుగా మహిళా సాధికారతను అనగ తొక్కుతూ వస్తుందని స్వాతంత్ర్యానికి ముందు అస్తమయం ఎరుగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశ ప్రజలందరూ స్వాతంత్ర్య ఉద్యమం చేసి ఎలా అయితే అస్తమయం చేశారో అదే బ్రిటిష్ స్థాపించిన కాంగ్రెస్ పార్టీని మహిళా లోకం భవిష్యత్తులో అస్తమయం చేస్తారని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం కాంగ్రెస్ పార్టీ మరియు కూటమి పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.మహిళా సాధికారత దేశ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని తెలియజేశారు.