జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 18 సెల్ 9550978955
కాంపౌండర్, నర్సుల సేవలు చాలా విలువైనవి అని ఎలాంటి భయంకరమైన అంటువ్యాధులు ప్రబలిన కానీ తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా సేవ చేసేవారే వీరు అందులో ఈ వృత్తిలో కొనసాగే వారందరూ బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు, అణగారిన వర్గాలకు చేయూతనందించాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు ఎంచుకున్న సేవా పరమైన వృత్తిని గౌరవించి తమ కుటుంబాలను పక్కనపెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తులు వీరు కనుక వారి యొక్క డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారమయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన నివాస గృహంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ వృత్తిలో కొనసాగే వారందరూ పేదరికంతో మగ్గిపోతూ ఉంటానికి సొంత నివాసం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం గుర్తించి కాంపౌండర్, నర్సుల నగర్ ఏర్పాటు చేసి ఈ వృత్తిలో కొనసాగే వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తశ్రీనివాసరావు, వడ్డాని చిన్న తో పాటు పలువురు పాల్గొన్నారు.


