Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ శేషాద్రి టి జి ఐ ఐ సిఈ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల ప్రకారం టి జి ఐ ఐ సి ఈ జోనల్ మేనేజర్ జీడిమెట్ల గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది మండలంలోని చండూరు శివారులో సర్వేనెంబర్ రెండులో టీజీ ఐఐసిఈ బోర్డు తొలగించి ప్రభుత్వ కార్యాలయాలకు భూమిని కేటాయించాలని జీడిమెట్ల జోనల్ మేనేజర్ కు చండూర్ సర్పంచి శేషాద్రి శుక్రవారం వినతి పత్రం అందజేయడం జరిగింది మండల కార్యాలయ నిర్మాణానికి చండూరు శివారులోని సర్వే నంబర్ 2లో 16 ఎకరాల్లో టీజీఐఐసిఈ బోర్డు ఏర్పాటు చేశారని దాని తొలగించి భూమిని కేటాయించాలని కోరినట్లు తెలిపారు చిలిపి చెడు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు చండూర్ సర్వే నంబర్ 2లో గల భూమిలో కార్యాలయాలు నిర్మించుకోవచ్చు అని తెలియజేశారు