Listen to this article


నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి ఎస్సై నర్సింలు

90 హెల్మెట్లు సొంత డబ్బులతో అందించిన శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్ రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రమాదాలను నివారించే బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి అన్నారు శుక్రవారం మండల పరిధిలోని శిలాంపల్లి గ్రామంలో తన సొంత డబ్బులతో సర్పంచ్ రాజేందర్రెడ్డి 90 హెల్మెట్లను సిఐ జాన్ రెడ్డి ఎస్సై నర్సింలు చేతులమీదుగా శిలాంపల్లి గ్రామస్తులకు అందించారు అనంతరం షిలాంపల్లి సర్పంచ్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ప్రమాదాలు జరగకుండా తన సొంత డబ్బులతో హెల్మెట్లను ప్రతి వాహనదారునికి అందిస్తున్నానని తెలియజేశారు హెల్మెట్ ధరించి వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు హెల్మెట్ ఉంటే ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉండదని గ్రామస్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్ రెడ్డి ఉప సర్పంచ్ కిష్టారెడ్డి వార్డ్ మెంబర్లు నవీన్ రెడ్డి శేఖర్ భగవంతు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు