Listen to this article

(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ )

సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి.భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు.ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమికి మునగాల మండల కేంద్రంలోని రోడ్లన్ని మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి.వ్యవసాయ, ఉపాధి హామి కూలీలు,కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఎండ తీవ్రత దృష్ట్య అవసరమైతే నే బయటకు రావాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తారస్థాయికి చేరుకొవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ చురుకుమంటోంది.11 గంటలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.ఇంట్లో ఉన్నా తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గలయిన కూలర్లు, ఏసీల ద్వారా ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు.