Listen to this article

జన న్యూస్ ఏప్రిల్(18) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ వేల్పుల కిరణ్ వారితో పాటు పలువురు నాయకులు శుక్రవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో హైదరాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. నూతనంగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మున్నమల్లయ్య ప్రధాన కార్యదర్శి బత్తిని సాయిలు గౌడ్ మాజీ పిఎసిఎస్ చైర్మన్ వెంకన్న మాజీ వైస్ ఎంపీపీ పరమేష్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.