జనం న్యూస్-ఏప్రిల్ 18- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ లోని జెన్కో ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్ ఆధ్వర్యంలో ఫైర్ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డిఐజి మాధవ రావు ఉత్తర్వుల మేరకు నాగార్జునసాగర్ లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా, ఫైర్ సర్వీసెస్ వీక్ 2026 కార్యక్రమంలో భాగంగా జెన్కో ఫైర్ విభాగానికి చెందిన అధికారులు, ఎస్ పి ఎఫ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో అనుకోకుండా అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎలా అడ్డుకట్ట వేయాలి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే విషయంలో సాగర్ జెన్కో అధికారులు, ఫైర్ సిబ్బంది, నాగార్జునసాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్, జెన్కో ఎస్ పి ఎఫ్ సిబ్బందిలతో కలిసి ఫైర్ మాక్ డ్రిల్ ను నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ లు రఘురాం, రామకృష్ణారెడ్డి, జెన్కో డి ఈ, ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, జెన్కో ఆర్ ఐ ప్రతాప్ నాయుడు సాగర్ డ్యాం ఆర్ఐ శ్రీనివాసరావు, డి ఈ లు, జెన్కో, ఎస్ పి ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


