Listen to this article

జనం న్యూస్ :18 ఏప్రిల్ శనివారం: సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్

శ్రీవాణి స్కూల్‌లో శనివారం యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు విద్యాభ్యాసంలో తొలి అడుగు పూర్తి చేసిన సందర్భంగా వారికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేశారు.స్కూల్ డైరెక్టర్ సి.హెచ్. సత్యం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తుకు పునాది ఈ దశలోనే వేయబడుతుందని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ,విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.