Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం

ప్రతినిధి గ్రంధి నానాజీ ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు నేతృత్వంలో కాట్రేనికోన, పల్లంకుర్రు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ( ఎస్ ఏ ఎస్ ఏ) కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ & స్వచ్ఛ ప్రతిజ్ఞ మంచినీటి వనరుల క్లోరినేషన్ నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యానికి అగ్ర పీఠం వేయాలని కార్యదర్శులు & సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పల్లంకుర్రు గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రాన్ని & మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలను సందర్శించారు.చిన్నారుల అభ్యాసనా సామర్ధ్యలను పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని,అభ్యాసనా సామర్ధ్యలను మెరుగు పరచాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఆయా కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు జె వి సత్యన్నారాయణ, రామారావు & స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు