జనం న్యూస్ ఏప్రిల్ 23 వరం ప్రతినిధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామ వాస్తవ్యులను ముమ్మిడివరం బాలయోగి కాలువ గట్టు గ్రామంలో శీలం ప్రకాష్ రావు సువర్ణ లక్ష్మిల ద్వితీయ కుమార్తె శీలం కుసుమ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో స్టేట్ మూడవ ర్యాంకు సాధించిన సందర్భంగా వారి స్వగృహంలో బిజెపి జిల్లా ట్రెజరర్ మరియు ఆధ్యాత్మిక సేవకులు గ్రంది సూర్యనారాయణ గుప్త (నానాజీ) భగవంతుని చిత్రపటంతో అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు అలాగే సమరసిత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గంగాభవాని దంపతులు శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది ఈ సందర్భంగా రవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ పెద్దిరెడ్డి రవికుమార్ మాట్లాడుతూ కళాశాల సిబ్బందికి కష్టపడి చదివి స్టేట్ ర్యాంక్ సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చిన కుసుమ కు ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బందితో పాటు వివిధ ప్రముఖులు పాల్గొని కుసుమ కు శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు పెద్దిరెడ్డి ఉమామహేశ్వర రావు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు
నాగులపల్లి వెంకటేష్ కొప్పిశెట్టి సత్యనారాయణ వాసంశెట్టి రాంప్రసాద్ షేక్ బాషా కుడుపూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



