Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 20

మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం వాణిజ్య గదుల నిర్మాణానికి భక్తిశ్రద్ధలతో శంకుస్థాపన మరియు భూమి పూజ నిర్వహించారు.శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ఆలయ ఈఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుండి 11:00 గంటల వరకు అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు కారంపూడి సాయి, గ్రామ పురోహితులు ఓరుగంటి ప్రసాద్ శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి, పునాది రాళ్లు వేశారు.ఈ వాణిజ్య గదులను కీర్తిశేషులు గాయం వెంకట రామిరెడ్డి, సీతా మహాలక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు దానపూర్వకంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ దాతలుగా,జంకే విజయ లక్ష్మి (భర్త చెన్నారెడ్డి),ఉడుముల సరస్వతి (భర్త లక్ష్మీ రెడ్డి) తర్లుపాడు మండల జడ్పిటిసి వెన్నా ఇందిర (భర్త హనుమారెడ్డి)తమ తల్లిదండ్రుల స్మృత్యర్థం ఈ పుణ్యకార్యానికిపూనుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు సూరెడ్డి సుబ్బారెడ్డి, కాలంగి పెద్ద శ్రీనివాసులు, వాడేల కృష్ణ ప్రసాద్, గోసుఆదినారాయణ, గోసు వెంకటేశ్వర్లు, ఎర్వ వెంకటరెడ్డి, పార్లపల్లి ప్రసాద్, జవ్వాజి వెంకటేశ్వర్లు, గాయం లక్ష్మి రెడ్డి,బేడుడూరి పుల్లయ్య, యన్ సి కృష్ణ రెడ్డి, చినమనగొండ సుబ్రహ్మణ్యం, కొలగట్ల కాశీరెడ్డి, వెలుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు