Listen to this article

మాజీ ఏఎంసీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్: .

బిచ్కుంద ఏప్రిల్ 20 జనం న్యూస్

సమాజంలో ఉన్న అనేక మూఢాచారాలను పారద్రోలి కుల,మత రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషిచేసిన ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర అని మాజీ ఏఎంసీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ అన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి సందర్భంగా పత్లాపూర్ గ్రామంలో శ్రీ బసవేశ్వర విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాగ్నాథ్ పటేల్ మాట్లాడుతూ సమాజం పట్ల అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు అని, బసవేశ్వరుడు జగత్ గురువుగా వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని,ప్రతిఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ వారు ఇచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఎక్కడ ఉద్రిక్త వాతావరణలు ఉండదన్నారు.బసవేశ్వరుడి చరిత్ర తెలుసుకునే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బసవేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తెలవాల్సిన అవసరం ఉందన్నారు.