జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955
పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్
జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా విషయం పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి. భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో కింద నిర్మించిన కంపోస్ట్ పిట్స్, సెగ్రిగేషన్ షెడ్లు నిర్వీర్యంగా ఉన్నాయి. కొన్ని చోట్ల నామమాత్రంగా మాత్రమే నిర్వహణ జరుగుతోంది.స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన ఈ యూనిట్లు ప్రస్తుతం చెత్త నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయి. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ తయారీ, రీసైక్లింగ్ వ్యవస్థ సరిగా అమలు కావడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత మరియు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.దీని వల్ల చెత్త నుంచి సంపద లక్ష్యం సాధ్యం కావడం లేదు. గ్రామాల్లో అస్వచ్ఛత పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది. ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తోంది.జిల్లా వ్యాప్తంగా అన్ని SLWM యూనిట్లపై ప్రత్యేక సమగ్ర ఆడిట్ నిర్వహించాలి.పనిచేయని కంపోస్ట్ పిట్స్ / షెడ్లను తక్షణం పునరుద్ధరించాలితడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కఠినంగా అమలు చేయాలి.ప్రతి గ్రామానికి తగినంత పారిశుధ్య కార్మికులను నియమించాలి.గ్రామ/వార్డు స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలు స్పష్టంగా నిర్ణయించాలి.కంపోస్ట్ ఉత్పత్తికి సరైన మార్కెట్ లింకేజీ కల్పించాలి.ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి.గ్రామాల్లో పారిశుధ్యం కేవలం నిర్మాణాలతో కాకుండా, సమర్థవంతమైన నిర్వహణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పై అంశాలపై తక్షణ చర్యలు తీసుకొని చెత్త నుంచి సంపద లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.
జనతా వారధి పల్నాడు జిల్లా టీమ్
ఇట్లు
ఏలూరి శశి కుమార్
జిల్లా అధ్యక్షులు
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా


