Listen to this article

భద్రాచలంలో మరోసారి రామకోటి రామరాజుకు ఘన సతెలంగాల రాష్ట్రం నుండి గజ్వేల్ లోని రామకోటి సంస్థకు అరుదైన గౌరవం -26 సంవత్సరాల రామభక్తికి మూడోసారి చోటు ఇచ్చామన్న -భద్రాచల దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ జనం న్యూస్ ఫిబ్రవరి 14; తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ద్రాచలంలో శ్రీరామనవమిన సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన తలంబ్రాలు వాడడం ఆనవాయితీ. ఈ గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనేందుకు కొన్ని ధార్మిక సేవా సంస్థలకు చోటు కల్పించారు. అందులో తెలంగాణ రాష్ట్రం నుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు ముచ్చటగా మూడోసారి చోటు దొరికింది. 250కిలోల గోటి తలంబ్రాలకు (ఓడ్లకు) శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు జరిపి రామకోటి రామరాజును దేవస్థానంలో ఘనంగా సన్మానించి ఓడ్లను అందజేశారు భద్రాచల దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామకోటి రామరాజు గత 26 వత్సరాలనుండి చేస్తున్న నిర్వీరామ కృషి, పట్టుదల అమోఘం అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే రామనామ స్మరణ చేయించి ఓలిపించి భక్తితో కళ్యానానికి గత 2సార్లు అందించారని తెలిపారు. గోటి తలంబ్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని రామనామమే శాశ్వతమని రామనామాన్ని లిఖింపజేస్తూ ప్రజలను భక్తిమార్గం వైపు పయనించే విధంగా ప్రయాణం సాగిస్తున్న రామకోటి రామరాజును ఆనాడే మరో భక్త రామదాసుగా కీర్తించమన్నారు. అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచలం ఆలయం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గోటి తలంబ్రాలు కార్యక్రమంలో మమ్మలని భాగస్వాములు చేయడం సంతోషంగా ఉందని మా గజ్వేల్ ప్రాంత భక్తుల కోరిక మేరకు 250 కిలోల వడ్లు తీసుకు వెళ్లడం జరుగుతుందని త్వరలోనే కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు