Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955

స్వయం సహాయక సభ్యులు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.115 మంది వీఓఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి.

స్వయం సహాయక సంఘాల మహిళలందరూ విధిగా ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాన్ని ప్రజలు గుర్తించేలా చూడాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. స్త్రీ సాధికారతే ధ్యేయంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతి పథకంపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత వీఓఏలదేనని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని 4013 మంది డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు వీఓఏలు నిరంతరం శ్రమిస్తుంటారని, వారు బాగుంటేనే మహిళా సంఘాలు బాగుంటాయని ప్రత్తిపాటి చెప్పారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), వెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, తొలుత 115 మంది వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) లకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి, వారి నుద్దేశించి మాట్లాడారు.మహిళలకు పట్టుదల, ఓర్పు, సహనం ఎక్కువ ఒక్కో వీఓఏ పరిధిలో 400 మంది స్వయం సహాయక సభ్యులున్నారని, వారి యొక్క కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి గ్రూపు నిర్వాహకులు పట్టుదలతో పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. మహిళలకు పట్టుదల, ఓర్పు, సహనం ఎక్కువని, అందుకే వారు అనుకున్నది సాధించడంలో పురుషుల కంటే మిన్నగా ఉంటారని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. వీఓఏలను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, డిఆర్డివో పిడి ఝాన్సీ రాణి, మూడు మండలాల ఏపీయంలు, సీసీలు, సివోలు, విఓఏ లు, తదితరులు పాల్గొన్నారు.