పట్లోళ్ల సంజీవరెడ్డి,
జనం న్యూస్,ఏప్రిల్ 20,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని ధర్మారం లక్ష్మి రాజిరెడ్డి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తయిన సందర్భంగా సోమవారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,తో కలిసి ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు స్వాంతిటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పండరి నాయక్,కృష్ణారెడ్డి, డాక్టర్ హమీద్, ముల్తాని బాబు సబ్, ఆకుల రాములు, జైపాల్,చాకలి అంబయ్య,గ్రామ పాలకవర్గం సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


