Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం

ముమ్మిడివరం మండల పరిషత్ కార్యాలయము, నందు ఇండ్ల జాబితా గణన పై చివరి బ్యాచ్ ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కు మూడు రోజులు శిక్షణా తరగతులు ప్రారంభము అయినవి. మే 1 నుండి 30 వ తారీఖు వరకు వీరు వారికీ కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాకులనందు ప్రజలనుండి వారి ఇండ్ల స్థితి, వసతులు, మొదలైన 34 రకాల వివరాలను మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తారు అని, ఈ జనగణనలో ప్రజల వివరాల సేకరణ పారదర్సకముగాను మరియు ఖచ్చితత్వము గాను ఉండవలెను అని ప్రతీ ఇంటినీ సందర్శించి వివరాలు సేకరించవలెను అని తహసిల్దార్ మరియు ఛార్జ్ ఆఫీసర్ అయిన శ్రీ తాడి సుబాష్ తెలిపినారు ,ఈ కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ జె.ఎల్ .యెన్ . దీక్షితులు, డిప్యూటీ తహసిల్దార్ శ్రీ గోపాల కృష్ణ , ఏ.ఎస్.ఓ. శ్రీ కె .ఎల్.ఎన్. శాస్త్రి, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ రామమోహన్ ,మండల ట్రయినర్లు శ్రీ రాంబాబు గారు, శ్రీ దశరధరామయ్య గారు, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల లు పాల్గొన్నారు.