Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 అమలాపురం

అయినవిల్లి ఆర్యవైశ్య సంఘ కళ్యాణ మండపం మొదటి అంతస్తు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబి) అనంతరం వారికి గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా అయినవిల్లి మండల వైశ్య సంఘ సభ్యులు బాబి కి ఘన సత్కారం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కొత్త కృష్ణ, గోకవరపు మురళి, గోకవరపు రాజా, పాబోలు శేషారావు, పాబోలు శివ, గెల్లి రాంబాబు, వీరబాబు, ఏసు, సింగంశెట్టి కుమార్, కాళ్ళకూరి కుమార్ మరియు అయినవిల్లి మండల వైశ్య సంఘ సభ్యులు, వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.