జనం న్యూస్ అల్లాదుర్గం మండలం
మెదక్ జిల్లా 21/4/2026 సోమవారం అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో రెండవ కొమరవెల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగినది, ఈనెల 26 దశమి ఆదివారం దశమి నుండి వైశాఖ శుక్ల తదియ ఆరు రోజులపాటు జరుగబడును,
26నా ఆదివారం సున్నముహూర్తము, 30నా గురువారం కడప కడుగుట, 1నా శుక్రవారం అమ్మవారికి మరియు స్వామివారికి బోనాలు, 2నా శనివారం మల్లన్న స్వామికి బండ్లు తిరగటం, 3నా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు శివపార్వతుల శాంతి కళ్యాణం మరియు రాత్రి 7 గంటల 10 నిమిషములకు లంక దహనము, 4నా సోమవారం పాచి బండ్లు తిరగటం తో ఈ జాతర మహోత్సవం ముగుస్తుంది, కావున జాతర ఉత్సవానికి వచ్చే చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది.


