జనం న్యూస్ 21 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
25 జిల్లాల్లో ఇప్పటికి ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయని ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి వరకు కేవలం 2.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిన పౌర సరఫరాల శాఖ ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కేవలం 3,310 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయగా అందులో దాదాపు 1000 కేంద్రాల్లోనే కొనసాగుతున్న కొనుగోళ్లు ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు, ములుగు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం కలిపి కేవలం 400 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిన ప్రభుత్వం 25 జిల్లాల్లో ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల నిర్వాహణ జరగకపోవడంతో, పెద్ద ఎత్తున దళారులకు, ప్రైవేట్ మిల్లర్లకు పంట విక్రయించాల్సి వస్తుందని రైతుల ఆందోళన ఇప్పటికైన ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు


