Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని కొప్పుల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాల సందర్భంగా సోమవారం గ్రాడ్యువేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ప్రీస్కూల్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ మామిడి అశోక్ హాజరై పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ చిన్నా రుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యమని, గర్భిణీల నుంచి పుట్టిన పిల్లల వరకు సరైన పోషణ అందించాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం పిల్లలకు యూనిఫారాలను కూడా పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ అలువాల భాస్కర్, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆశలు, పాల్గొన్నారు….