Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 21 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ మల్లికార్జున్ అప్ప షెట్కార్ సతీమణి శ్రీమతి గిరిజ మల్లికార్జున్ అప్ప షెట్కార్ పరమపదించారు..విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం రోజు బిచ్కుందకు చేరుకుని వారి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గిరిజ మల్లికార్జున్ అప్ప షెట్కార్ గారి మరణం ఎంతో దురదృష్టకరం మరియు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు..వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు..