జనం న్యూస్ ఏప్రిల్ 2 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం
మండల పరిషత్ కార్యాలయము, నందు ఇండ్ల జాబితా గణన పై చివరి బ్యాచ్ ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను జిల్లా ముఖ్యప్రణాళికాధికారి మరియు జిల్లా మాస్టర్ ట్రయినర్ అయిన శ్రీ ఎం . మురళీకృష్ణ సందర్శిoచినారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అందరు సచివాలయము ఉధ్యోగులు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) విధిగా చేసుకోవాలని మరియు వారి బంధువులు, మిత్రులను కూడా స్వీయ గణన చేసుకునేలా ప్రోత్సహించాలని సూచిoచినారు. మనరాష్ట్రములో స్వీయ గణన కార్యక్రమము ఏప్రిల్ 30వ తేదీతో ముగుస్తుంది కావున ఎన్యూమరేటర్లు మీ పరిదిలో రోజుకు కనీసం 10 నుండి 15 కుటుంబాలు స్వీయ గణన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించినారు. ఈ కార్యక్రమములో తహసిల్దార్ మరియు ఛార్జ్ ఆఫీసర్ అయిన శ్రీ తాడి సుబాష్, డిప్యూటీ తహసిల్దార్ శ్రీ గోపాల కృష్ణ , అమలాపురం డివిజన్ ఉప గణాoక అధికారి శ్రీ ఏ . ప్రభుదాసు , ఏ.ఎస్.ఓ. శ్రీ కె .ఎల్.ఎన్. శాస్త్రి, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ రామమోహన్ ,మండల ట్రయినర్లు శ్రీ రాంబాబు , శ్రీ దశరధరామయ్య , ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల లు పాల్గొన్నారు



