Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని జెడ్ పి ఎచ్ ఎస్ విద్యార్థుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ‌ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ హాజరై బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ మాట్లాడుతూ శాయంపేట గ్రామ ప్రజలు తమ యొక్క పిల్లల్ని ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అని తెలియపరిచి ప్రభుత్వ పాఠశాలలోకి పంపగలరని ఆయన తెలియపరిచారు ఈ సందర్భంగా పాఠశాలలో డిజిటల్ విద్యా బోధన శారీరక వికాసం కోసం ఆటలు మానసిక వికాసం కోసం లైబ్రరీ విశాలమైన క్లాస్ రూముల నైతిక విలువల బోధన మధ్యాహ్న భోజనం స్కూలు యూనిఫార్మ్స్ షూస్ టై బెల్ట్ బుక్స్ ప్రభుత్వమే ఇస్తుంది అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధన కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపగలరు అని తెలియజేశారు ఈ బడి బాట కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పద్మ రాజబాపూ రావు సత్యప్రసాద్ వంశీ శ్రీనివాస్ పాల్గొన్నారు…