జనం న్యూస్ ఏప్రిల్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా 23 గురువారం ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం భజనలతో ఊరేగింపు గురు ప్రవచనాలు పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం తదనంతరం భజన కార్యక్రమాలు ఉంటాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారా పదవ వార్షికోత్సవానికి విచ్చేయుచున్న గురు స్వామీజీలు శ్రీ ఆనందం ఆర్యులు ముంగిమల్ల పీఠాధిపతి శ్రీ బసవరాజు సదాశివపేట పీఠాధిపతి శ్రీ సర్వేశ్వరాంబిక శివయోగి శ్రీగిరి శేషాద్రి మఠం మరియు శ్రీ మోహన్ రాజ్ స్వామీజీ స్వాములు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ముఖద్వారా 10వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయగలరు తదనంతరం ఉదయం స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మరియు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి అలాగే ఆంజనేయులు గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి భజనలతో ఊరేగింపు నిర్వహిస్తారు ఆలయ ముఖద్వారం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి అలాగే స్వామీజీల గురు ప్రవచనాలు ఉంటాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం వరకు భజనలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భజన మండలి సభ్యులు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కులమత తేడా లేకుండా విజయవంతం చేయగలరు


