Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మైలారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సందర్శించి పాఠశాలలో తాగునీటి సౌకర్యాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యి పై వాడుతున్నట్లు గమనించి కలెక్టర్ తీవ్రంగా స్పందిస్తూ స్కూల్ లో సమస్యలు ఎందుకు చెప్పలేదంటూ ఎం ఈ ఓ ను ప్రశ్నించి అసంతృప్తి వ్యక్తం చేశారు అంగన్వాడీ లో గర్భిణీలు బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం పై అరా తీశారు చిన్నారులతో ఇంగ్లీష్ పద్యాలు చదివించి వారి అభ్యాస స్థాయిని అంచనా వేశారు అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వారోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశాల్లో ఎండ నుండి రక్షణకు నీడ టెంట్లు చల్లని నీరు తప్పనిసరిగా ఉండాలి కూలీలకు పనికి వేళల్లో జాగ్రత్తలు పాటించాలని డీ
హైడ్రోషన్ గురికాకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ డి ఆర్ డి ఓ శీను జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరామకాంతం శాయంపేట మండల తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో పాణి చంద్ర తదితరులు పాల్గొన్నారు….