జుక్కల్ ఏప్రిల్ 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో ఈరోజు నిర్వహించిన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఇలాంటి పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.మొహమ్మద్ నగర్ మండలంలోని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.



