జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి శారద నగర్ ఏడో వీధిలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకంగా శ్రేయ మనోవికాస కేంద్రం ప్రారంభమైంది. నాగవరపు శేషవల్లి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బుధవారం జిల్లా విశ్రాంత ఉప విద్యాశాఖాధికారి కె.వి గౌరీపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతంలో మానసిక వికలాంగుల కోసం విద్యాసంస్థలు, వసతిగృహాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నారు. వికలాంగులకు వారిలో ఉన్న వైఖల్యం ఆధారంగా విద్యాబోధన చేయడం సులభం అయిందన్నారు. కానీ మానసిక వికలాంగులకు విద్యాబోధన, నివాసం ఏర్పాటు చేయడం చాలా కష్టసాధ్యo అన్నారు. వీరికి జీవితాంతం బోధన, వసతి అవసరం అవుతుందన్నారు. అనకాపల్లి ప్రాంతంలో సేవా భావంతో ఇటువంటి విద్యాసంస్థను ప్రారంభించడం అభినందినీయమన్నారు. శ్రేయ మనోవికాస కేంద్రం జిల్లాతో పాటు, గతంలో అనకాపల్లిలో కూడా సుదీర్ఘ కాలం పాటు మానసిక వికలాంగులకు సేవలందించిన చరిత్ర కూడా ఉందన్నారు. ట్రస్ట్ బాధ్యుడు వెంకటరమణ మూర్తి మాట్లాడుతూ తన భార్య దివంగత నాగవరపు శేష వల్లి పేరిట ఫస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా మానసిక వికలాంగుల కోసం నిస్వార్ధంగా తమ వంతు సహాయాన్ని అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చామన్నారు. ట్రస్ట్ బాధ్యులు డాక్టర్ పి ఉషాదేవి, డాక్టర్ కేయూ గిరిధర్ లు మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి పలు సంస్థల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు అనకాపల్లిలో మరలా శ్రేయ మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. అందుకు అనుగుణంగా మంచి సదుపాయలతో కూడిన భవనం కూడా అందుబాటులోకి వచ్చింది అన్నారు. తమకు ఇప్పటికే పెందుర్తి, విశాఖపట్నంలో మానసిక వికాస కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి అన్నారు. అదే స్ఫూర్తితో జిల్లా కేంద్రం అనకాపల్లిలో కేంద్రాన్ని మరలా ప్రారంభించామన్నారు. మానసిక వికలాంగులకు ఇతర వికలాంగులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. వీరికి జీవితాంతం వసతి, శిక్షణ అవసరం అవుతుందన్నారు. అలాగే వీరిని ఎలా చూసుకోవాలో తల్లిదండ్రులకు కూడా తరచూ మేము శిక్షణలు ఇస్తామన్నారు. వీరికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. త్వరలోనే స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా శిక్షణ అందిస్తామన్నారు. మానసిక వికలాంగుల సంరక్షణ కు వీరు ఉపయోగపడతారన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రభు వరప్రసాద్ మాట్లాడుతూ శ్రేయ మనోవికాస కేంద్రాన్ని మానసిక వికలాంగుల విద్యార్థులకు ఒక ఆలయంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. మానసిక వికలాంగులకు వారి దిన చర్యలు వారు నిర్వహించుకునే విధంగా శిక్షణ అందిస్తామన్నారు. అలాగే వారి తల్లిదండ్రులు మనోధైర్యాన్ని నింపడానికి కృషి చేస్తామన్నారు. అనకాపల్లి ప్రాంతంలో మానసిక వికలాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మనోవికాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షినియమని డాక్టర్ బుద్ధ సోమేశ్వరరావు అన్నారు. సాయి శర్మ, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు


