Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955

సమావేశానికి హాజరు అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు,ఐపీఎస్ కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ యాక్సిడెంట్స్ డేటాను పరిశీలించి ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు.గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు.సంబంధిత శాఖలైనటువంటి రెవిన్యూ, రవాణా, R&B, నేషనల్ హైవేస్ మరియు ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయం తో పనిచేయాలని ఆయన కోరారు.ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని , ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని,ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించేలా చూడాలని ఎస్పీ తెలిపారు.ఎస్పీ యూ టర్న్స్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం నోడల్ అధికారి E – DAR యాప్ పైన అవగాహన కల్పించారు..ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపిఎస్ తో పాటు జిల్లా రవాణా శాఖ అధికారి,ఆర్& బి ఇ.ఇ, ఆర్టీసీ ఆర్.ఎం NHAI అధికారులు మరియు రోడ్ సేఫ్టీ N.G.O దుర్గ పద్మజ తదితరులు పాల్గొన్నారు.