సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 22. 04. 2026
రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుండి మహాధర్నాలకు పిలుపు ఇచ్చిన జేఏసీ మొదటిరోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన నాయకత్వం ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం ప్రభుత్వం వేసిన కమిటీ సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేసిందని తెలిపిన జేఏసీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని, ఉద్యోగులను ఇతర జోన్లకు బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ


