జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు గత మూడు నెలలుగా చేసిన పనులకు డబ్బులు రాక, అసలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బి ఎస్ ఎస్ మారపల్లి సుధాకర్ బహుజన సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల పని చేస్తున్న కూలీలకు సకాలంలో డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, 100 రోజుల కూలీలు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి గడ్డపార, పారా, డబ్బాలు చేత పట్టుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎర్రటి ఎండలో పనిచేస్తూ చేతులకు కాయలు కాసేలా కష్టపడి పనిచేసి ఇంటికి బియ్యం కొనుక్కొని పోదామంటే చేసిన పనికి సమయానికి డబ్బులు అందక, ఈ పనికి వస్తే తిరిగి వేరే పని చేసే సమయం లేక చేసిన పనికి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియక, గత మూడు నెలలుగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు
అదేవిధంగా పనిచేసే ప్రాంతాలలో కనీసం వాటర్ సౌకర్యం, వైద్య సౌకర్యం, కనీసం నీడ సౌకర్యం కూడా లేకుండా, ఎర్రటి ఎండలో మాడిపోతున్నామని అన్నారు, ముఖ్యంగా పనిచేసే క్రమంలో ఏదైనా గాయాలపాలైతే మా సొంత ఖర్చులతో భరించాల్సిందే తప్ప ఇక్కడ అటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు.కాబట్టి ఈ వందరోజుల పని పైనే ఆధారపడి ఉన్నాం కాబట్టి మూడు నెలలుగా డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి తక్షణమే మా డబ్బులను విడుదల చేసి మా ఖాతాలో వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ధైనంపెళ్లి సుమన్, నడిగోట్టు వీరస్వామి, రమేష్, సునీత, సుజన, సదానందం, సారయ్య, సమ్మయ్య, సాంబయ్య, కొమురయ్య, కూలీలు పాల్గొన్నారు…..


