జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం మైలారం గ్రామంలో ఎంపీయుపిఎస్ మైలారం పాఠశాలలో ఈరోజు 2025-26 విద్యా సంవత్సరం చివరి పని దినం రోజు 23-04-2026 రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ మనోజ్ కుమార్ అధ్యక్షతన గ్రామ సర్పంచ్ నూనె దివ్య, ఎ ఎ పి సి చైర్మన్ గడిపే సుమలత ,వార్డు సభ్యులు ,ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల – ఉపాధ్యాయుల ” సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి వారి ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థులలో ప్రగతికి ,వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించారు. పిల్లలతో ఎక్కువ సమయం గడిపి ఎండలో తిరిగి వడదెబ్బకు గురికాకుండా ఇండోర్ గేమ్స్ ను ఆడించాలని తెలిపారు పిల్లలతో కథల పుస్తకాలు ,పూర్వ తరగతి, పై తరగతికి సంబంధించిన పుస్తకాలు చదివించాలని కళా నైపుణ్యాలు పెంపొందించడం కోసం బొమ్మలు గీసి రంగులు వేయడం, పేపర్ క్రాఫ్ట్ ,మ్యూజిక్, డాన్స్, మ్యాజిక్, మిమిక్రీ నేర్చుకొనే ప్రయత్నం చేయాలని అన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ నూనె దివ్య మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో మన గ్రామ విద్యార్థులను అందరినీ చేర్పించాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమం గురించి మాట్లాడుతూ ,గ్రామస్తుల మందిరం భాగ్యస్వామ్యం అవుదామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు…


