జనం 23 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి
ఆర్టీసీ కార్మికులు రెండవ రోజు పరిగి బస్టాండ్ ముందు డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తుతో ప్రైవేట్ వ్యక్తులతో లారీ డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో, బస్సులో నడిపిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పిఆర్సి బకాయిలను చెల్లించాలని లేనియెడల సమ్మె తీవ్ర ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ న్యాయమైన హక్కులు, సముచిత వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం చేపట్టిన సమ్మెను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తీవ్రంగా ఖండనీయం ప్రజా రవాణా వ్యవస్థను బలహీనపరుస్తూ కార్మికులను అణగదొక్కే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించకుండా బెదిరింపులు, అరెస్టులు, ఒత్తిళ్లు తీసుకురావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఆర్టీసీ కార్మికుల పోరాటం కేవలం వారి హక్కులకే కాకుండా ప్రజల సేవల పరిరక్షణకూ సంబంధించినది ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులతో చర్చలు ప్రారంభించి వారి డిమాండ్లను నెరవేర్చాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.


