తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 ఏప్రిల్ 2026
ఈ సందర్భంగా కేడీఆర్ యువసేన బృంద సభ్యులు గోపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, గోపాల్ యాదవ్, నరసింహ రెడ్డి, నాగేశ్, ఆనంద్ యాదవ్, నవీన్, హేమ, రాకేష్ గుప్తా తదితరులు సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ జాగృతి నాయకులు బాలయ్య కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మరియు సమాజ అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా చేరిన నాయకులు, యువకులు మరియు ప్రజలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.కలబ్గూర్ సంఘమిత్ర మరియు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి సిద్ధాంతాలు తమను ఆకర్షించాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేడీఆర్ యువసేన సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


