జనం న్యూస్ ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి నాయకులు గజ్జెల లక్ష్మీనారాయణ రెడ్డి ( జి ఎల్ ఎన్ రెడ్డి) జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రెడ్డి సంఘం నాయకులు, జిఎల్ అభిమానులతో కలిసి బండి మధుసూదన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి లు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్య ఉదయం తెలంగాణ ఎడిటర్ భాష స్థానిక విలేకరులు శ్యామ్ సుందర్, క్రాంతి కుమార్ లతో కలిసి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శాలువ తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచితనానికి మారు పేరు అయిన జి ఎల్ ఎన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, రానున్న రోజుల్లో అన్నకు మేము సైతం అంటూ అండగా నిలుస్తామని అన్నారు.అనంతరం అభిమానులు మాట్లాడుతూ అన్నా అంటే నేనున్నా అంటూ ముందుకొచ్చే మా జిఎల్ఎన్ అన్న జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కోటి కాంతుల చరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అన్న మీకు హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో శివారెడ్డి, దీపక్ రెడ్డి, అఖిల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, కచ్చిన్ మహబూబ్, నాగభూషణ్ రెడ్డి, తులసి రెడ్డి, సాయినాథ్ రెడ్డి, గాల్ రెడ్డి, తిరుపతి కోటేశ్వర్ రావు, ఆదిరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి, సుబ్బారెడ్డి, హరి, మూర్తి, హుస్సేన్, స్వరూప్, వేణు, శ్యామ్, శ్రీధర్, ప్రేమ్, అభినయ్, అభి తదితర అభిమానులు, పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు.



