

జనం న్యూస్,జనవరి10, పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ చినమల్లం హరిజన పేట వాస్తవ్యురాలు దివ్యాంగురాలు అయినటువంటి మానుకొండ రూతు(అనంతలక్ష్మి )తన తల్లి అనసూయను పోషించుకుంటూ జీవనంగడుపుచున్న ఈమె అనారోగ్య కారణంగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాలమరణం చెంది నందున వారి తల్లిగారిని చెల్లి ఈశ్వరిని భారత జనత ట్రస్ట్ ఫౌండర్ పారుపల్లి ఏసురత్నం , సెక్రటరీ పొట్టి బాబురావు, జాయింట్ ట్రెజరర్ పొట్టి పౌలీన వెళ్లి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థికసహాయము అందించారు.