Listen to this article

పర్వేక్షిస్తున్న నందలూరు కన్సిస్టేటివ్ మెంబెర్ రాచూరి మురళి.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు రిపోర్టర్ డాక్టర్ వి డేవిడ్ న్యాయం న్యూస్ ఏప్రిల్ 23. నందలూరు రైల్వే అండర్ బ్రిడ్జి నందు రైల్వే అధికారుల సూచనల మేరకు రైల్వే గతి శక్తి ప్రతినిధులతో మాట్లాడిన రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి రైల్వే అండర్ బ్రిడ్జి నందు పాదాచారుల కోసం ఫుట్ పాత్ ఏర్పాటు,వాటర్ లీకేజీ సమస్య అలానే ఫ్లోరింగ్ మరమ్మతులు గురించి మాట్లాడి మండల ప్రజలు రైల్వే అండర్ బ్రిడ్జి ప్రయాణం నందు ఇబ్బందులకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మాట్లాడటం జరిగినది ఇందుకుగాను రైల్వే గతి శక్తి ప్రతినిధులు రెండు రోజులలో పూర్తి మరమ్మతులు ప్రారంభిస్తామని అలాగే పాదాచారు లకు ఫుట్ పాత్ నిర్మాణం ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగినది ఇందుకుగాను రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి నాణ్యమైన రోడ్డు మార్గాన్ని ప్రజలకు అంకితం చేయాలని రాబోవు రోజులలో ఈ మార్గం ప్రజల రాకపోకలకు సులభతరం కావాలని కోరడం జరిగినది. ఇందుకుగాను రైల్వే గతి శక్తి ప్రతినిధులు కచ్చితంగా రైల్వే అండర్ బ్రిడ్జి మార్గాన్ని ఎటువంటి లోపాలు లేకుండా సరిచేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఇందుకుగాను నందలూరు రైల్వే అండర్ బ్రిడ్జి విషయంలో సమస్యలపై వెను వెంటనే తగు చర్యలు తీసుకున్నటువంటి రైల్వే డివిజనల్ అధికారులకు రాచూరి మురళి కృతజ్ఞతలు తెలపడం జరిగినది.