జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గద్దెపాగ మణి కుమార్ జోగులాంబ ::-(జిల్లా కేంద్రం)::- ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని.. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దెపాగ మణికుమార్ డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికులు ఏర్పాటు చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన 32 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కాలయాపన చేయడంతోనే దిగ్భ్రాంతికి గురైన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని పట్టించుకుని మృతి చెందడం బాధాకరమన్నారు. శంకర్ గౌడ్ మృతి ఆర్టీసీకి తీరని లోటు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ఈనెల 29వ తేదీన ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు చేసే అర్థనగ్న ప్రదర్శనలకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుందని మరియు పాల్గొంటుందన్నారు. అదేవిధంగా ఈనెల 28వ తేదీన మహిళా కార్మికులు చేసే బతుకమ్మ కార్యక్రమంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్మికులకు మద్దతుగా పాల్గొంటారని సందర్భంగా ఆయన సూచించారు. మౌన ప్రదర్శనలు, వంటావార్పు, కార్మికుల కవాతు లాంటి కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని ఆయన చెప్పారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్ రవీందర్ ఆత్మహత్యాయత్నంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులతో చర్చించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో అలంపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శాంతి రాజు, ఇటిక్యాల మండల అధ్యక్షుడు జీవన్ ఇతరులు పాల్గొన్నారు.


