Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణ మున్సిపాలిటీలో వివిధ హోదాలో నియమించ బడిన బీజేపీ కౌన్సిలర్లను అభినందించి ఘనంగా సన్మానించిన బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరియు దిశ కమిటీ సభ్యులు సీనియర్ అడ్వకేట్ వడ్డేపల్లి శ్రీనివాసన్, ఇటీవల జరిగిన మున్సిపాలిటీలో వివిధ హోదాలో నియమించబడిన బీజేపీ కౌన్సిలర్లును మెట్ పల్లి బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి ధర్మపురి స్వరూప వేణుగోపాల్ గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, ఫ్లోర్ కార్యదర్శి గా శ్రీమతి పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి,పార్టీ విప్ గా దొనికెల శిరీష నవీన్,కౌన్సిలర్ కోయల్కార్ స్రవంతి లింగేశ్వర్ వీరిని వడ్డేపల్లి శ్రీనివాసన్ ఆద్వర్యంలో బీజేపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు, అనంతరం వడ్డే పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మన ఎంపీ అర్విoద్ ధర్మపురి సూచనలతో ప్రజాసమస్యలపై పోరాడి ఏ సమస్యా ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరారు, ఈ సందర్బంగా ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు రామచందర్ రావు కి,మన ఎంపీ అర్విoద్ ధర్మపురి కి,జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు కి,రాష్ర్ట కార్యవర్గ సభ్యులు డా.అనూప్ రావుకి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు కై పోరాడుతామని వివరిస్తూ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలోబీజేపీ సీనియర్ నాయకులు మిట్టపెల్లి కృష్ణమూర్తి,10వ,వార్డు పద్మశాలి సంఘం అధ్యక్షులు గోవర్ధన రవీందర్,నూర్ బాషా సంఘం అధ్యక్షులు రబ్బు, తిరుసుల్ల అర్జున్,గుంటుక హన్మాoడ్లు,బోగ దత్తు,గోవర్ధన అశోక్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు