జనం న్యూస్ ఏప్రిల్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. స్థానిక ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు నాంది పలికే కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ చేతుల మీదుగా పాపిరెడ్డి నగర్ రోడ్ నంబర్ 1 మరియు 2, బి-బ్లాక్ పరిధిలో యూజీడీ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ కాంటెస్టెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తయితే కాలుష్య సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కలుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో చర్ల రామకృష్ణారెడ్డి, మాయ రాజయ్య, చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి, ఈరెడ్డి దేవేందర్ రెడ్డి, మాయ బాల నరసయ్య, డాకురి అక్కిరెడ్డి, శ్రీకాంత్ బూలక్ష్మి, ఎడ్ల సంపత్ రెడ్డి, మహేష్, శరత్ రెడ్డి, జీవన్, స్వామి, భిష్ణు రామ్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శోభా రెడ్డి, టీవీ పద్మ, సులోచన, పద్మ, వెంకట లక్ష్మీ, మనోజ్, రమేశ్, మల్లికార్జున్ తదితర సీనియర్ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మొత్తంగా ఈ యూజీడీ పనుల ప్రారంభం పాపిరెడ్డి నగర్ ప్రాంత అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన మైలురాయిగా స్థానికులు భావిస్తున్నారు.


