జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 23 ప్రస్తుత ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని మండల వ్యవసాయ అధికారి పి. జోష్నాదేవి సూచించారు. తర్లు పాడు గ్రామసచివాలయంలో వ్యవసాయ మరియు APCNF సిబ్బందికి రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమనిపేర్కొన్నారు. ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ మేరీమణి రైతులకు ఉపయోగపడే విత్తన గుళికల తయారీని మరియు ప్రకృతి వ్యవసాయంలో వాడే వివిధ రకాల కషాయాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించారు.ఈకార్యక్రమంలో మండలంలోని రైతు భరోసా కేంద్రాల (RSK) సిబ్బంది మరియు APCNF సిబ్బంది పాల్గొన్నారు.


