Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకుని కాట్రేనికోన,పల్లంకుర్రు & చెయ్యేరు గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. జీవితంలో కీలక ఘట్టాలు అయిన జననం, వివాహం, మరణం* ఈ మూడింటికి సంబంధించిన ధ్రువపత్రాలు ఇచ్చేది గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలేనని ఈ సందర్బంగా కొనియాడారు. గ్రామాల్లో పౌర సేవలకు అంత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేశారు. మంచి నీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వాహణపై క్షేత్ర స్థాయి సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.గ్రామ పంచాయతీలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలని కీర్తించారు. అనంతరం ఎంపీడీఓ ఆయా హరిత రాయ బారులను( క్లాప్ మిత్రాస్) దుస్సాలువతో సత్కరించి గ్రామ సభ వేదికగా వారి సేవలను కొనియాడారు. పి ఎస్ఎన్ రాజు( విలేకరు రాజు) మోకా అప్పాజీ వాసంశెట్టి రాజేశ్వరరావు ఆయా గ్రామ సభల్లో పంచాయతీ కార్యదర్శులు జె వి సత్యన్నారాయణ, రామారావు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, స్వర్ణ గ్రామ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు*