జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం రైతులను నట్టేట మోసం చేసి ముంచు తున్నారు. మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కుఫెడ్ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు కేంద్రంలో అధికారులు ఎవ్వరు ఉండరు. రైతులకు బార్ధన్ గోనె సంచులు ఇవ్వడం లేదు. రైతులే సంచులను 30 రూపాయలు చొప్పున కొనుగోలు చేసుకొని మక్క జొన్నలను నింపుకొని కొనుగోలు కేంద్రం కు తీసుక రావాలని సూచిన్నారు. ప్రభుత్వం గోనె సంచులు 11 రూపాయలే కట్టిస్తూoదని 20 రూపాయలు నష్ట పోతున్నామని రైతులు మీడియా కు వాపోయారు. అలాగే మక్కజొన్న బస్తాలను కాంట లో మోసంచేస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. 50 కేజీ మక్క లకు 1కేజీ 300 నుండి 1కేజీ 800 గ్రాములు తరుగు తీస్తూ రైతులను నష్ట పరుతున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు మండల కేంద్రం లో మక్క జొన్న కేంద్రం ను పరిశీలించి మోసాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు……


