Listen to this article

..విప్ దాట్ల

జనం న్యూస్ ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం

రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యము గింజ సరైన మద్దతు ధర కల్పించేందు కు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ట్రాక్టర్లపై వచ్చిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుచ్చిబాబు పచ్చ జెండా ఊపి ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. శుక్రవారం ఐ. పోలవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు కాకర్లపూడి సత్య వెంకట రాయపరాజు ( బుజ్జిరాజు) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై పండించిన దాల్వా పంట ధాన్యాన్ని తీసుకువచ్చి సొసైటీ ద్వారా విక్రయించే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా భావిస్తూ కనీస మద్దతు ధర (ఏమ్. ఎస్. పి) ప్రకారం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. మధ్యవర్తులపై, దళారులపై ఆధారపడకుండా రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశాన్ని ఐ. పోలవరం సొసైటీ అధ్యక్షులు కాకర్లపూడి సత్య వెంకట రాయప్పరాజు బుజ్జి ద్వారా రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు సాగిరాజు సూరిబాబురాజు, పీ న్నమరాజు శివ, దేవు రాంబాబు, నంబూరి సీతారామరాజు, చిలువూరీ సుబ్బరాజు, డి.సి.సి.బి మేనేజర్ జి మనోహర్, సూపర్వైజర్ సుంకర రాంబాబు, సీ.ఈ.ఓ లు కుచ్చర్లపాటి శ్రీనివాసరాజు, జి. ఆంజనేయులు, బాసిరెడ్డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.