Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 25 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని పుల్కల్ గ్రామంలో శనివారం నాడు సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి పుల్కల్-2 వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వరి సేకరణ ప్రక్రియను పరిశీలించారు.కేంద్రంలో వరి తేమ శాతం, తూకం ప్రక్రియను స్వయంగా పరిశీలించారు వరి తూకం వేగవంతం చేయాలని, టి ఏ బి( TAB )ఎంట్రీ 100% పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సేకరణ పారదర్శకత పాటించాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు ఎమ్మార్వో వేణు గోపాల్, ఏఈఓ దయానంద్, సెక్రటరీ సాయిప్రకాశ్ మరియు రైతులు పాల్గొన్నారు.