జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్‌లో రాజకీయ నాయకుల అండదండలతో సాగుతున్న అక్రమాలపై జాతీయ మానవ హక్కుల కమిటీ మండల అధ్యక్షులు ఏదుల రాజశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్లాంట్‌లో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టారు.అధికార దుర్వినియోగం,గ్రామంలో ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులు, మిషన్ భగీరథ ప్లాంట్‌లో ఉద్యోగాలను కూడా అనుభవిస్తూ ద్వంద్వప్రయోజనాలు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. ఒకవైపు రాజకీయ పదవుల్లో ఉంటూ, మరోవైపు ప్రభుత్వ వేతనం పొందడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.విధులకు గైర్హాజరు అకౌంట్లలోజీతాలు,సదరు వ్యక్తులు ప్లాంట్‌కు,వెళ్లివిధులునిర్వహించకుండా నిత్యం డుమ్మా కొడుతున్నారని, అయినప్పటికీ అధికారుల అండదండలతో ప్రతి నెలా వారి ఖాతాల్లో జీతాలు జమ అవుతున్నాయని విమర్శించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, ఇలాంటి వారు పదవులను అడ్డం పెట్టుకుని నిరుద్యోగుల పొట్ట కొట్టడం శోచనీయమని అన్నారు.తక్షణమే చర్యలు తీసుకోవాలి,రాజకీయ పదవుల్లో ఉన్న వారిని వెంటనే మిషన్ భగీరథ ఉద్యోగాల నుండి తొలగించాలని, వారి స్థానంలో గ్రామంలోని అర్హులైననిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు…..


