సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం25. 04. 2026 జహీరాబాద్, ఏప్రిల్ 25:
జహీరాబాద్ పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త బెజగం లక్ష్మయ్య, లక్ష్మీ ల కుమారుడు సాయికిరణ్, కోడలు మౌనిక ల కుమారుడు శ్రీహాన్ జన్మదిన వేడుకలు స్థానిక మంకాల్ బ్యాన్క్వేట్ హాల్ లో శనివారం నాడు అట్టహాసంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు వెంకట్ జోషి వేద ఆశీర్వచనాలు అందజేయగా పలువురు ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు. స్థానిక వస్త్ర వ్యాపార దిగ్గజం అల్లాడి వీరేశం, అల్లాడి నర్సిములు, నీల వెంకటేశం, బండమీది రాములు, బండమీది శ్రీనివాస్, బెజగం వేణుగోపాల్, బెజగం జగదీశ్వర్, మారమ్మార్ ప్రదీప్ , గాజుల నాగేందర్, ఎన్నం రఘు, సూదాం వెంకట్, సుధాకర్, కౌన్సిలర్లు నామ స్రవంతి రవికిరణ్, గున్నెల్లి కవిత అశోక్ పాటిల్, మాజీ కౌన్సిలర్ మహిపాల్ రెడ్డి, కిషన్ సార్డా, జయసింహా రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


