Listen to this article

(జనం న్యూస్ ఏప్రిల్ 25 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ )

జనగణన 2027 జనాభా లెక్కల ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా ఏప్రిల్ 26 నుండి మే 10 2026 వరకు తమ యొక్క కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నదని, ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక తహసిల్దార్ సరితా అన్నారు.శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సాంకేతికత కలిగిన వారు ఆన్ లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని, అదేవిధంగా ప్రతి కుటుంబ సభ్యుల వివరాలను జనగణలో నమోదు చేసేందుకు అధికారులు సైతం తమ నివాసాలకు వచ్చి పూర్తి వివరాలు నమోదు కూడా చేస్తారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ,ఆర్ఐ లు రామారావు, మంజుల, మునగాల గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తో పాటు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.